రోబోటిక్ టెక్నాలజీతో క్లిష్టమైన మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు
యశోద హాస్పిటల్ డాక్టర్ విక్రమ్
కామారెడ్డి, నవంబర్ 17 (విజయక్రాంతి): ఆధునిక వైద్య సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి క్లిష్టమైన మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్(Yashoda Hospital) డాక్టర్ విక్రమ్ తెలిపారు. మంగళవారం కామారెడ్డి లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఇటీవల గతంలో మోకాలి జాయింట్లో ఇన్ఫెక్షన్ కారణంగా శస్త్రచికిత్స చేయించుకున్న ఓ మహిళకు మోకాలి కీలు బిగుసుకుపోవడం, కాలు వంకరగా మారడం, నడవలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఈ క్లిష్టమైన కేసును పరిశీలించిన వైద్యులు ప్రత్యేక ఇంప్లాంట్లు, అధునాతన పరికరాలను ఉపయోగించి రోబోటిక్ టెక్నాలజీ సహాయంతో శస్త్రచికిత్స నిర్వహించి విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. కామారెడ్డి యశోద ఆసుపత్రి కన్సల్టెంట్ కార్యాలయంలో డాక్టర్ విక్రమ్ మాట్లాడారు. మరోవైపు పదేళ్లుగా మోకాలి నొప్పితో బాధపడుతున్న ఓ ఉపాధ్యాయురాలికి రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానంతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు.
రోబోటిక్ సహాయంతో అత్యంత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ఎంతోమందికి మోకాలు చిప్పాల ఆపరేషన్లనులు విజయవంతంగా పూర్తి చేసి ఎంతోమందికి ఆరోగ్య జీవన ప్రమాణాలు పెంచినందుకు డాక్టర్ విక్రమ్ కు రాష్ట్ర గవర్నర్ ఇటీవల ప్రతిభపురస్కార అవార్డును అందజేశారు. ఇలాంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలను అనుభవజ్ఞులైన వైద్య బృందం, అవసరమైన అధునాతన సదుపాయాలు ఉన్న పెద్ద వైద్య కేంద్రాల్లో నిర్వహించడం ముఖ్యమని యశోద హాస్పిటల్ వైద్యులు తెలిపారు. ఈ సమావేశంలో మోకాలి శాస్త్ర చికిత్స :లు విజయవంతమైన ఇద్దరు మహిళలు వారి అనుభవాలను తెలియజేశారు. శాస్త్ర చికిత్స అనంతరం తమ ఆరోగ్య పరిస్థితి ఎంతో మెరుగైందని వారు ఆనందం వ్యక్తం చేశారు.