మాదకద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యం
భిక్కనూర్, నవంబర్ 11 (విజయ క్రాంతి):మాదకద్రవ్యాల రహిత సమాజ(Drug-free society) నిర్మాణమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర(Bicycle Journey) చేపట్టిన సామాజిక కార్యకర్త ఐ. విజయలక్ష్మి గురువారం తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణాన్ని సందర్శించనున్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్లో(Drug-Free India Campaign) భాగంగా నిర్వహించనున్న.
ఈ అవగాహన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను దక్షిణ ప్రాంగణ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్. సుధాకర్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటి వల్ల కలిగే అనర్థాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎస్. నారాయణ గుప్తా మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం,
అక్రమ విక్రయాల నియంత్రణపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ పీఆర్ఓ పిట్ల సరిత, డాక్టర్ ప్రతిజ్ఞ, డాక్టర్ మోహన్ బాబు, డాక్టర్ లలిత, డాక్టర్ హరిత, వైశాలి, దిలీప్, అఫ్రీన్ బేగం, కనకయ్య, శ్రీకాంత్, విజయ్, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.