విద్యార్థులు క్రీడలలో దూసుకుపోవాలి
తాడ్వాయి,(విజయక్రాంతి): విద్యార్థులు(Students) క్రీడలలో మరింత ముందుకు దూసుకు వెళ్ళాలని ప్రతినిధులు తెలిపారు. కామారెడ్డి జిల్లా(Kamareddy district) తాడ్వాయి మండలం కారడ్ పల్లి ఉన్నత పాఠశాల(Karad Palli High School)లో గురువారం మండల స్థాయి ఎస్ జి ఎఫ్ క్రీడలలో గెలుపొందిన విద్యార్థులను అభినందించారు. అనంతరం ప్రతినిధులు మాట్లాడుతూ...ప్రతి విద్యార్థి క్రీడల్లో మరింత తర్ఫీదు పొంది రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు హేమాద్రి,వ్యాయామ ఉపాధ్యాయులు రాములు, ఉపాధ్యాయులు సంజీవ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు రాములు, గఫూర్,రాజయ్య తదితరులు పాల్గొన్నారు.