ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు
పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజా ప్రభుత్వం
మంథని, నవంబర్ 5 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Government of Telangana State) ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం(Indiramma Housing Scheme) పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు.
మంథని మండల పరిధిలోని నగరంపల్లి గ్రామపంచాయతీకి చెందిన ఎండీ అస్మాకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తికావడంతో గురువారం నిర్వహించిన గృహప్రవేశ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్, టీజీఈఆర్సీ సలహాదారు శశిభూషణ్ కాచే పాల్గొని నూతన గృహ యజమానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం కోసం ఆర్థిక సహాయం అందిస్తూ పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేద కుటుంబాలకు ఆత్మగౌరవంతో కూడిన నివాస సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాతరి లత శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షుడు మంథని సత్యం, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎరుకల ప్రవీణ్, సర్పంచ్ జాడి రామస్వామి, ఎస్సీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి అక్కపాక సదయ్య, ఉపసర్పంచ్ కూరమశెట్టి సతీష్, వార్డు సభ్యులు నుండ్ల సదానందం, మబ్బు తిరుపతి, కొయ్యల మొండి, కొమ్ము శ్రీనివాస్, నరిగె జగ్గులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.