మహిళా సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన
05-11-2026 | 10:06pm
నిజాంసాగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో మహిళా సంఘ భవనానికి సర్పంచ్ చంద్ర కళా వెంకటేశం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజా పండరి శంకుస్థాపన చేశారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రతి గ్రామంలో మహిళా సంఘ భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రజా పండరి పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు చిరంజీవిలు తదితరులు పాల్గొన్నారు.