పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడిగా బోయిని నారాయణ

05-11-2026 | 09:59pm

మంథని నియోజకవర్గంలో ఓబీసీ మోర్చా బలోపేతానికి కృషి చేస్తా: బోయిని నారాయణ

మంథని, నవంబర్ 05 (విజయక్రాంతి) బీజేపీ ఓబీసీ మోర్చా(BJP OBC Morcha) పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడిగా మంథని నియోజకవర్గానికి చెందిన బోయిని నారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శాతరాజు రమేష్(OBC Morcha District President Shataraju Ramesh) ఆయనకు నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా బోయిని నారాయణ మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గందమల్ల ఆనంద్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి, సీనియర్ నాయకులు కొండపాక సత్యప్రకాష్, మొలుమూరి శ్రీనివాస్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పిడుగు కృష్ణ, జిల్లా అధ్యక్షుడు శాతరాజు రమేష్‌తో పాటు మంథని నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఓబీసీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, మంథని నియోజకవర్గంలో ఓబీసీ మోర్చాను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని బోయిని నారాయణ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు