బంగారు నెక్లెస్ పోగొట్టుకున్న ప్రయాణికురాలు

05-11-2026 | 10:01pm

నెక్లెస్ అప్పగించి నిజాయితీని చాటుకున్న కండక్టర్ 

మహబూబాబాద్,(విజయక్రాంతి): బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికురాలు నాలుగు లక్షల రూపాయల విలువైన బంగారు నక్లెస్ తో పాటు ఇతర వస్తువులు ఉన్న బ్యాగును బస్సులో మరిచిపోయింది. ఆ బ్యాగును కండక్టర్ నిజాయితీగా సదరు బాధితురాలికి అప్పగించిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో చోటు చేసుకుంది. తొర్రూరు ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న డిఎన్ రావు ఒక ప్రయాణికురాలు తన బస్సులో మోత్కూర్ లో బస్సు ఎక్కి భువనగిరిలో దిగిన క్రమంలో తన వెంట తెచ్చుకున్న  బ్యాగును బస్సులో వదిలిపెట్టి దిగిపోయింది.

ఆ బ్యాగ్ ను గమనించిన కండక్టర్ బస్సులో ప్రయాణికులను వివరాల గురించి అడగగా ఎవరు స్పందించకపోవడంతో బ్యాగును తెరిచి చూడగా అందులో సుమరు నాలుగు లక్షల విలువచేసే  బంగారు నక్లెస్ తో పాటు కొంత నగదు, ప్రయాణికురాలికి సంబంధించిన ఫోన్ నెంబర్ లభించడంతో ఆ నెంబర్ కి కాల్ చేసి ప్రయాణికులు కి  బ్యాగ్ ను అందజేశారు. ఈ విషయం తెలుసుకున్న డిపో మేనేజర్ ప్రసన్నలక్ష్మి  కండక్టర్ తన విధుల పట్ల శ్రద్ధతో నిజాయితీ ని చాటుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని శాలువ తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆమని, కంట్రోలర్ రమేష్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు