అర్హులైన లబ్ధిదారులకు చేయూత పింఛన్ల పంపిణీ

17-11-2026 | 08:32pm

కరీంనగర్ సిటీ నవంబర్17 (విజయ క్రాంతి ): కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్(Karimnagar Municipal Corporation) పరిధిలోని 4వ డివిజన్ గోపాలపురంలో అర్హులైన లబ్ధిదారులకు చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 4వ డివిజన్ అధ్యక్షులు గాదె శివరాం మాట్లాడుతూ లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వితంతువులు, చేనేత కార్మికులు, కాలుగీత కార్మికులు మరియు ఇతర అర్హులైన పేదలకు చేయూత పింఛన్లు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని గాదె శివరాం పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు