మున్సిపల్ కార్పొరేషన్ లో దీపావళి వేడుకలు

07-11-2026 | 11:41pm

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీపావళి పండుగను పురస్కరించుకొని నిర్వహించిన లక్ష్మీపూజ కార్యక్రమంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ మరియు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా నగర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లుమాసం గణేష్, చాడగొండ బుచ్చిరెడ్డి, అడిషనల్ కమిషనర్లు వేణుమాధవ్, ఖాదర్ మోహియోద్దీన్, అయాజ్ మరియు అధికారులు సిబ్బంది సునీల్ కుమార్, సుంచు నర్సయ్య, టి.వెంకటేష్, దుర్గం సంధ్య, తేజస్విని, హరిత, త్రివేణి, విజయలక్ష్మి, సౌజన్య, తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు