కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా కట్ట దావీద్
పాపన్నపేట: పాపన్నపేట మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్(Papannapet Congress SC Cell) అధ్యక్షుడిగా కట్ట దావీద్ను నియమిస్తూ డీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ తాడేపు మహేందర్(DCC SC Department Chairman Tadepu Mahender) శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మండల పరిధిలోని మిన్పూర్ గ్రామానికి చెందిన దావీద్ అనాదిగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో పార్టీ పదవి అప్పగించిన చైర్మన్ తాడేపు మహేందర్, ఎమ్మెల్యే రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, పాపన్నపేట మండల అధ్యక్షులు నరేందర్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తానని ఈ సందర్బంగా తెలిపారు.