జెడ్పీహెచ్ఎస్ మేడిపల్లిలో విద్యార్థులకు రోబోటిక్స్ శిక్షణ

07-11-2026 | 11:48pm

సోహం ఎన్జీవో ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం

రోబోల తయారీలో పాల్గొన్న విద్యార్థులు!

మేడిపల్లి,(విజయక్రాంతి): విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు సృజనాత్మకతకు పదును పెట్టే లక్ష్యంతో మేడిపల్లిలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం సోహం ఎన్జీవో ఆధ్వర్యంలో రోబోటిక్స్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు రోబోటిక్స్‌పై అవగాహన కల్పిస్తూ రోబోట్ అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది? సెన్సార్లు, మోటార్లు, కోడింగ్ వంటి అంశాలను ప్రయోగాత్మకంగా వివరించారు.

అంతేకాకుండా విద్యార్థులతోనే చిన్న చిన్న రోబోట్లను తయారు చేయించి, వాటిని స్వయంగా నడిపించారు. రోబోటిక్స్ శిక్షణ ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలు, సమస్యలను పరిష్కరించే నైపుణ్యం, స్ఫూర్తి పెంపొందుతాయని నిర్వాహకులు తెలిపారు. పుస్తకాలకే పరిమితం కాకుండా సైన్స్, గణిత శాస్త్ర అంశాలను ప్రయోగాల ద్వారా నేర్చుకోవడం వల్ల విద్యార్థుల్లో అభ్యసన పట్ల ఆసక్తి  పెరుగుతుందని, భవిష్యత్తుకు ఉపయోగపడే ఇలాంటి వినూత్న శిక్షణ కార్యక్రమాలను రానున్న రోజుల్లో మరిన్ని నిర్వహిస్తామని ప్రధానోపాధ్యాయులు ఎల్.సత్య ప్రసాద్ తెలిపారు.

మరిన్ని వార్తలు