మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతోత్సవాలు

11-11-2026 | 08:10pm

కొత్తపల్లి, నవంబర్ 11 (విజయక్రాంతి): కొత్తపల్లి పట్టణంలోని ఆల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి(Maulana Abul Kalam Azad Jayanti)ని పురస్కరించుకుని నిర్వహించినటువంటి ప్రత్యేక వేడుకలకు అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి వారు చేసిన సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ యువత వారి నుండి స్ఫూర్తి తీసుకోవాలని మరియు అమలుపరచినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను విస్తరింప చేయాలని వారు కోరారు. నేడు భారతదేశ విద్యా రంగంలో అగ్రగామిగా ఉండడానికి ప్రధాన కారణం వారేనని అదే విధంగా సాంస్కృతిక రంగంలో సైతం భారతదేశ విజయాలు సాధిస్తున్నదంటే వారి యొక్క కృషి మాత్రమేనని సగర్వంగా చెప్పవచ్చని వాళ్ళు చెప్పారు.

ఏమి ఆశించకుండా దేశసేవనే పరమావధిగా భావించి భారతదేశానికి నూతన చరిత్రను లిఖింప చేసినటువంటి గొప్ప రాజనీతిజ్ఞుడు, రాజకీయ నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు వారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించినటువంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆలోచింపచేశాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు