బాలల హక్కుల పరిరక్షణకు గ్రామసభ

14-11-2026 | 09:42pm

కల్లూరు, నవంబర్ 14 (విజయక్రాంతి): బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని రఘునాథ బంజర యూపీఎస్ పాఠశాలలో సర్పంచ్ కుక్కా సుధారాణి అధ్యక్షతన బాలల గ్రామసభ (Children's Gram Sabha) నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ (Pledge) చేయించారు.

పాఠశాలలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సర్పంచ్ విద్యార్థులను కోరారు. ఉపాధ్యాయులు బోధించే మంచి విషయాలను నేర్చుకుంటూ విద్యలో రాణించి, తల్లిదండ్రులు, పాఠశాల, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. బాలల సమస్యల పరిష్కారానికి (Child Rights) ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సురేష్ బాబు, గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, పెద్దలు కుక్కా రానా, కర్నాటి రామకృష్ణారెడ్డి, అంగన్‌వాడీ టీచర్ రేవతి, ఆశా కార్యకర్త సావిత్రి, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు