పేదలకు ఆర్థిక భరోసాగా చేయూత పింఛనులు
రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల మందికి కొత్త పింఛన్ల పంపిణీ
ప్రతి విద్యార్థిపై రూ. 1.25 లక్షలు ఖర్చు చేసి ఉచిత నాణ్యమైన విద్య
మంచుకొండ లిఫ్ట్, బుగ్గవాగు పథకాల ద్వారా చెరువులు నింపి మండలాన్ని సస్యశ్యామలం చేస్తాం
కరువు, తుఫానులను తట్టుకునేలా రైతులు ఆయిల్ పామ్, ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలి
లబ్ధిదారులకు నూతన చేయూత పింఛనులు, స్మార్ట్ రేషన్ కార్డులు అందజేసిన మంత్రి
ఖమ్మం/రఘునాథపాలెం, నవంబర్ 14(విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం(Welfare of the poor) కోసం రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల మందికి కొత్తగా చేయూత పింఛన్ల పంపిణీ(Distribution of 'Cheyutha' pensions) కార్యక్రమాన్ని చేపట్టినట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) అన్నారు . శనివారం రఘునాథపాలెం మండలం(Raghunathapalem Mandal) మంచుకొండ గ్రామంలో నిర్వహించిన చేయూత పింఛన్లు, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ(Distribution of smart ration cards) కార్యక్రమంలో మంత్రి, జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ తో కలిసి పాల్గొని, లబ్ధిదారులకు చేయూత పింఛను మంజూరు పత్రాలను, స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేదలు ఆత్మగౌరవంతో జీవించేలా పింఛన్ల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ప్రజావాణిలో వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బోధకాలు బాధితులు పింఛన్ల కోసం పెట్టుకున్న దరఖాస్తులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించామని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో ఇబ్బందులు ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందిస్తున్నామని స్పష్టం చేశారు. వృద్ధాప్యంలో కొడుకులు, కోడళ్లపై ఆధారపడకుండా మందులు, భోజన ఖర్చుల కోసం ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు.
చేయూత పింఛనుల పథకం లో భాగంగా రఘునాథపాలెం మండలంలో 844 మందికి, జిల్లా వ్యాప్తంగా 33,000 మందికి కొత్త పింఛన్లు మంజూరయ్యాయని, వచ్చే నెల 1వ తేదీ నుండి వీరికి పింఛన్ అందుతుందని మంత్రి తెలిపారు. ఇంకా ఎవరైనా అర్హులు మిగిలి ఉంటే భవిష్యత్తులో పరిశీలించి న్యాయం చేస్తామని అన్నారు. పింఛన్లతో పాటు తెల్ల రేషన్ కార్డులు లేని అర్హులందరికీ స్మార్ట్ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి అన్నారు. లబ్ధిదారులు ఎటువంటి కంగారు పడకుండా, ఆయా గ్రామ పంచాయతీల వారీగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల వద్దకు వెళ్లి తమ సర్టిఫికెట్లు పొందాలని సూచించారు.
రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ల ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. చేయూత పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సబ్సిడీతో పాటు పేదల సంపాదన ఆసుపత్రులు, చదువుల పాలు కాకుండా ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకుంటోందన్నారు. మండలంలోని ప్రతి బిడ్డ చదువుకునేలా ప్రభుత్వ గురుకులాలు, రెసిడెన్షియల్, త్వరలో రాబోయే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ. 1.25 లక్షలు ఖర్చు చేస్తోందని తెలిపారు. విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్, బూట్లు, బెల్టులు అందించి నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు.
గతంలో వర్షాధారంపైనే ఆధారపడి, వేసవి వస్తే కనీసం తాగడానికి, పశువులకు, ఇంటి ముందు కళ్లాపి చల్లడానికి కూడా నీళ్లు లేక ఇబ్బంది పడిన రఘునాథపాలెం మండలాన్ని సస్యశ్యామలం చేస్తున్నామని తెలిపారు. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మండలంలోని చెరువులన్నింటినీ ముందుగానే నింపి భూగర్భ జలాలు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పంగిడి చెరువుకు కాలువను తీయించే పనులను త్వరలోనే మంజూరు చేసి ఆ ప్రాంతానికి నీరందిస్తామన్నారు. బుగ్గవాగు పథకం ద్వారా పైప్లైన్ వేసి మిగిలిన అన్ని చెరువులకు వేసవిలోనూ నీరు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని, తద్వారా బోర్లు పుష్కలంగా నీరందుతుందని తెలిపారు. తిరుమలాయపాలెం మండలం తరహాలోనే రఘునాథపాలెం కూడా పచ్చబడాలని మంత్రి ఆకాంక్షించారు.
పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినోప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా కరువు ఛాయలు, అకాల వర్షాలు, తుఫాన్ల ముప్పు పొంచి ఉందని మంత్రి అన్నారు. ఇటీవలి తుఫాను వల్ల వరి పంటలు నేలమట్టమై రైతులు తీవ్రంగా నష్టపోయారని, అదే సమయంలో ఆయిల్ పామ్ తోటలకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని అన్నారు. రైతులు కేవలం వరిపైనే ఆధారపడకుండా, ఉన్న నీటి వనరులకు అనుగుణంగా తక్కువ నీటితో, తేమకు పండే శనగలు, కందులు, పెసలు, మినుములు వంటి ఆరుతడి పంటలు సాగు చేయాలని మంత్రి సూచించారు.
కూరగాయలు, మిర్చి పంటల్లో అంతర పంటగా ఆయిల్ పామ్ మొక్కలు నాటుకోవాలని, 2.5 సంవత్సరాల తర్వాత…