గ్రామసభ నిర్వహణపై అవగాహన
ఆసిఫాబాద్(విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలం(Asifabad Mandal) గుండి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల(Government High School) ఆవరణలో సర్పంచ్ జబరి రవీందర్(Sarpanch Jabari Ravinder) అధ్యక్షతన బాలల స్నేహపూర్వక గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా బాలల హక్కులు(Children's Rights), విద్య, ఆరోగ్యం, పోషకాహారం, బాలల భద్రత, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నివారణ తదితర అంశాలపై చర్చించారు. పిల్లలకు నాణ్యమైన విద్య, సురక్షిత వాతావరణం కల్పించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంతోష్, వార్డు సభ్యులు రాజు, తిరుపతి, ప్రవీణ్, రాజేష్, పంచాయతీ కార్యదర్శి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.