డ్యాన్సర్‌గా నిరూపించుకుంటా!

05-11-2026 | 05:15am

మౌళి తనూజ్ ప్రశాంత్(Mauli Tanuj Prashanth) హీరోగా నటిస్తున్న క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్(Crime comedy entertainer) ‘దొంగ నా కొడుకు’. ఈ సినిమాతో శ్రీను కంబాల(Srinu Kambala) దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం నవంబర్ 13న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సుస్మితా శెట్టి విలేకరులతో ఈ చిత్ర విశేషాలు ఆమె మాటల్లోనే.. “-నేను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాను. మా గ్రాండ్ పేరెంట్స్ కన్నడ నుంచి 40 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చారు.

నాకు శ్రీదేవి గారు స్ఫూర్తి. చిన్నప్పటి నుంచి అన్ని రకాల డ్యాన్సులూ నేర్చుకున్నా. డ్యాన్స్ చేసేటప్పుడు చాలా ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా నాకు నటనపై ఆసక్తి ఏర్పడింది. ఫారిన్‌లో చదువుకునేటప్పుడే థియేటర్ కూడా చేశా. -లీడ్ హీరోయిన్‌గా ‘దొంగ నా కొడుకు’ నా మొదటి సినిమా. ఇందులో చాలా క్యూట్ అండ్ బబ్లీ క్యారెక్టర్ చేశా. కొంచెం తింగరి (నవ్వుతూ) క్యారెక్టర్. తను చాలా స్మార్ట్ అనుకునే క్యారెక్టర్. నా క్యారెక్టర్‌తో ఇన్నోసెంట్ కామెడీ ఉంటుంది. ఏదైనా స్మార్ట్‌గా చేయాలనుకుంటే అది కామెడీగా మారుతుంది. అమాయకంగా తనకు తెలియకుండానే నేర సంఘటనల్లో భాగమవుతూ ఉంటుంది.

మౌళి చాలా టాలెంటెడ్. హంబుల్‌గా ఉంటారు. తనతో కలిసి పనిచేయడం చాలా మంచి అనుభూతినిచ్చింది. ఈ సినిమాలో ఒక డ్యాన్స్ నంబర్ ఉంది. అది కచ్చితంగా అందరినీ అలరిస్తుంది. భవిష్యత్తులో మంచి డ్యాన్స్ సాంగ్స్‌లో నన్ను నేను నిరూపించుకోవాలనుంది. ‘మహానటి’లో అన్ని రకాల భావోద్వేగాలుంటాయి. నాకు అలాంటి ఒక సినిమా చేయాలనుంది. స్పోర్ట్స్ సినిమాలూ, రొమాంటిక్ కామెడీలు, హారర్, సస్పెన్స్ థ్రిల్లర్స్‌ను కూడా ఇష్టపడతా. ప్రస్తుతం -తమిళంలో రెండు ప్రాజెక్టులు చేస్తున్నా” అని తెలిపింది. 

మరిన్ని వార్తలు