గురుకుల ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
మహబూబాబాద్, నవంబర్ 29 (విజయక్రాంతి): మహబూబాబాద్ గురుకుల విద్యాలయంలో జరిగిన బాలిక ప్రసూతి ఘటనను నిరసిస్తూ, బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ లో నల్లతువ్వాలతో మాజీమంత్రి సత్యవతిరాథోడ్(Former Minister Satyavathi Rathod), మాజీ యంపి మాలోత్ కవిత, జెడ్పీమాజీ చైర్ పర్సన్ ఆంగోత్ బిందు., బిఆర్ఎస్ యువజనవిభాగం మహబూబాబాద్ ఇంచార్జ్ యాళ్ళ మురళీధర్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, బీ ఆర్ ఎస్ నాయకులు నిరసన తెలిపారు. గురుకులాల నిర్వహణ పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, పేద విద్యార్థుల అభ్యున్నతి పట్ల ఆలక్ష్యం వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణం గద్దె దిగాలని డిమాండ్ చేశారు. పేదల సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం కనికరం లేదని విమర్శించారు.