గ్రామాభివృద్ధి కోసమే పార్టీ మారా..!

17-11-2026 | 01:04pm

కాట్రపల్లి సర్పంచ్ సూరయ్య

కేసముద్రం, (విజయక్రాంతి): గ్రామాభివృద్ధి కోసమే బీఆర్ఎస్ పార్టీ(BRS Party) నుంచి కాంగ్రెస్ పార్టీ(BRS Party)లో చేరినట్లు కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామ సర్పంచ్ ఎదురబోయిన సూరయ్య(Katrapalli Sarpanch Eduraboyina Surayya) అన్నారు. పార్టీ మార్పు విషయంలో కాట్రపల్లి ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. మంగళవారం  గ్రామములో  నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు.

20.19 కోట్ల రూపాయల వ్యయంతో అర్పనపల్లి నుంచి వరంగల్ జిల్లా నాగారం వరకు నూతనంగా వేయనున్న ఆర్ అండ్ బీ రోడ్డు నిర్మాణ పనులను రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో నిరుపేదలకు 50 ఇందిరమ్మ ఇండ్లు, అర్హులైన పేదలకు పింఛన్లు, నూతనంగా గ్రామపంచాయతీ భవనం మంజూరు చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు