సమాజ సేవకు వేదిక లయన్స్ క్లబ్
మహబూబాబాద్ (విజయక్రాంతి): సమాజ సేవా కార్యక్రమాలు(Social service activities) నిర్వహించడానికి లయన్స్ క్లబ్ ఒక విశిష్టమైన వేదిక అని లయన్స్ క్లబ్ రీజినల్ చైర్ పర్సన్ నాగవాణి అన్నారు. మహబూబాబాద్ లయన్స్ క్లబ్(Mahabubabad Lions Club) మాన్యత ఆధ్వర్యంలో మొదటి సర్వ సభ్య సమావేశం మాన్యత క్లబ్ ప్రెసిడెంట్ శ్యామలాదేవి అధ్యక్షతన గురువారం నిర్వహించారు.
ఈ సమావేశనికి లయన్స్ క్లబ్ రీజినల్ చైర్ పర్సన్ నాగవాణి , జీ ఈ టీ కోఆర్డినేటర్ శారద ముఖ్య అతిథులుగా హాజరై లయన్స్ క్లబ్ ఆఫ్ మాన్యత విస్తృత సేవల పట్ల హర్షం వ్యక్తం చేశారు. కోఆర్డినేటర్ శారద మాట్లాడుతూ క్లబ్ మెంబర్షిప్ ని పెంచాలని ప్రతి ఒక్క లయన్ అయిదుగురు కొత్త మెంబర్స్ ని క్లబ్ లోకి ఆహ్వానించి స్టార్ చార్టర్ మెంబర్ గా గుర్తింపు పొందాలని, ఇంకా లయన్స్ క్లబ్ సేవలలో అందరూ ఉత్సాహంగా పాల్గొనాలని ప్రోత్సహించారు.
ఆర్ సీ నాగవాణి మాట్లాడుతూ డిసెంబర్ 19న తొర్రూరు లో నిర్వహించుకోబోయే ఆర్ సీ సమావేశంలో మాన్యత క్లబ్ సభ్యులంతా వారు చేసిన సేవలను చక్కగా ప్రదర్శించాలని ,క్లబ్ సభ్యులంతా సోషల్ మీట్ ఏర్పాటు చేసుకుని అందరూ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. ఈ సమావేశంలో లయన్స్ క్లబ్ మహబూబాబాద్ మాన్యత క్లబ్ సెక్రటరీ బండి అరుణ ,ట్రెజరర్ పరకాల కళావతి, లయన్స్ క్లబ్ చాటర్ మెంబర్స్ రంగా వజ్జుల సునీత ,కీసర సుధా రెడ్డి, కైరంకొండ లలిత, అడ్డిచెర్ల లలిత పాల్గొన్నారు.