అనుమతులు ఒక చోట... మట్టి తరలింపు మరొక చోట
- తీర్మాణానికి వ్యతిరేకం అంటున్న మహిళా సర్పంచ్
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సర్పంచ్ అంబాల సౌజన్య
- బగ్గుమంటున్న వర్గ పోరు
- అధికార పార్టీలో ముసలం
కన్నాయిగూడెం, నవంబర్ 19(విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని గూర్రేవుల గ్రామంలో(Gurrevula Village) కల్వర్టుల నిర్మాణం కోసం మట్టి తరలింపు కోసం గ్రామపంచాయతీ తీర్మానం చేసిన పంచాయతీ పాలకవర్గం(Panchayat Governing Body) మండల రెవిన్యూ అధికారుల(Revenue officials) నుంచి అనుమతులు తీసుకున్నారు.
మట్టి అనుమతి తీసుకున్న అనంతరం ఉప సర్పంచ్ నిర్దేశించిన ప్రాంతంలో కాకుండా గతంలో నిర్మించిన రోడ్డుకు తరలించడంతో సర్పంచ్, ఉప సర్పంచ్ మధ్య వర్గపోరు బయట పడింది. ఇద్దరు ప్రజాప్రతినిధులు కూడా అధికార పార్టీలో ఉంటూ అభివృద్ధి పనుల విషయంలో తారతమ్యాలు రావడంలో అది కాస్త రచ్చకెక్కింది.
గూర్రేవుల సర్పంచ్ అంబాల సౌజన్య ఏకంగా అనుమతి లేని ప్రాంతానికి మట్టి ఎందుకు తరలిస్తున్నారో ఉప సర్పంచ్ సమాధానం చెప్పాలని వీడియోస్ విడుదల చేసారు.గ్రామపంచాయతీ తీర్మానం ప్రకారం నిర్దేశించిన కల్వర్టులకు మాత్రం మట్టి తరలించాలని వీడియో రూపంలో ఉప సర్పంచ్ చేస్తున్న దోపిడీని బయటపెట్టారు.
పట్టించుకోని అధికారులు
అనుమతులు ఇచ్చామా..? అంతే సంగతి మట్టి తరలింపు అనుమతి ఇచ్చిన ప్రాంతానికే తరలిస్తున్నారా..?లేక ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారా...?అని పర్యవేక్షణ చేయాల్సిన రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదని మహిళా సర్పంచ్ ఆరోపించారు. తక్షణమే రెవెన్యూ అధికారులు స్పందించి అనుమతి ఉన్న చోట మాత్రమే మట్టి తరలించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.