సీఎం సభకు బెజ్జంకి కాంగ్రెస్ శ్రేణులు
బెజ్జంకి, నవంబర్ 19: సిద్దిపేటలో నిర్వహించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) బహిరంగ సభకు గురువారం బెజ్జంకి మండలంలోని అన్ని గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులతో సభకు వెళ్లే మార్గాల్లో సందడి నెలకొంది.
ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మద్దతుగా, పార్టీపై అభిమానంతో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా సభకు బయలుదేరారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు కదలడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.