అనారోగ్య బాధితురాలికి రూ.3 లక్షల ఎల్‌ఓసీ అందజేత

19-11-2026 | 05:38pm

మంత్రి శ్రీధర్ బాబు చొరవతో సంధ్యారాణికి వైద్య సహాయం

మంథని, నవంబర్ 19(విజయ క్రాంతి): మంథని నియోజకవర్గ(Manthani Constituency) ప్రజలకు ఆపద సమయంలో అండగా నిలుస్తూ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన ఉదారి సంధ్యారాణి అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో (NIMS Hospital) చికిత్స పొందుతున్నారు.

వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించాలని మంత్రి శ్రీధర్ బాబును కోరగా, ఆయన వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా రూ.3 లక్షల విలువైన ఎల్‌ఓసీ మంజూరు చేయించారు. హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన ఆసుపత్రి సహాయకులు బాధితురాలి కుటుంబ సభ్యులకు రూ.3 లక్షల ఎల్‌ఓసీని అందజేశారు. కష్టకాలంలో వైద్య చికిత్సకు ఆర్థిక భరోసా కల్పించిన మంత్రి శ్రీధర్ బాబుకు సంధ్యారాణి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు