సోషల్ మీడియాలో వ్యాఖ్యలపై బీజేపీ నేతల ఫిర్యాదు
మహబూబాబాద్ (విజయక్రాంతి): సోషల్ మీడియా వేదికగా బీజేపీ పార్టీపై, నాయకులపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ పట్టణ పార్టీ ఇంచార్జ్ ఎల్ది మల్లయ్య గౌడ్, పార్టీ నాయకులు బాలునాయక్ అన్నారు. పట్టణ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక టౌన్ సిఐ రఘుపతి రెడ్డికి( CI Raghupathi Reddy ) పిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను ఆసరాగా చేసుకుని ఓ వ్యక్తి బీజేపీ పార్టీ హిందూ పార్టీ అని ,మిగతా కులాలపై కక్ష సాధింపు విధానాన్ని అమలు చేస్తున్నారని మాట్లాడాన్ని ఖండించారు. ఆ వ్యక్తి వ్యాఖ్యల వల్ల సమాజంలో కులమతాల మధ్య ఘర్షణ ఙరిగేల ఉన్నాయని అతనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పిర్యాదులో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఇందు భారతీ, మైనారిటీ మోర్చా రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు రేష్మా, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సురేష్, సీనియర్ నాయకులు వలప దాస్ భద్రయ్య, 26 వార్డు కౌన్సిలర్ శ్రీదేవీ, సీనియర్ నాయకులు బాలునాయక్, చుక్కల నరేష్, పట్టణ ఉపాధ్యక్షుడు రవి యాదవ్, ప్రధాన కార్యదర్శి రవినాయక్, పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు శైలజా, దగ్గుల సుజాత, సురేష్ , ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.