అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు

19-11-2026 | 05:32pm

ఎర్రుపాలెం నవంబర్ 19 (విజయ క్రాంతి): రాజకీయాలకు(Politics) అతీతంగా గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు(Welfare Schemes) అందేలా కృషి చేస్తానని  సర్పంచి కాకర్లమూడి అని పేర్కొన్నారు. గురువారం నాడు పెగళ్ళపాడు గ్రామపంచాయతీ కార్యాలయం నందు సర్పంచి కాకర్లమూడి అనిల్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో   వితంతువు ఒంటరి మహిళ పింఛన్ పత్రాలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన  మండల ఎంపీడీఓ శారదా దేవి మరియు ఎంపీవో కృష్ణ  అర్హులైన లబ్ధిదారులకు 17 మందికి పింఛన్లు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు . ఏ పార్టీ అనే తేడా లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని పెగళ్ళపాడు గ్రామ సర్పంచ్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి చేరేలా తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

ఎన్నో సంవత్సరాలుగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయడంతో, పింఛన్ పత్రాలు అందుకున్న లబ్ధిదారులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ చావా తులసి  ఉప సర్పంచ్ గూడూరు నాగలక్ష్మి  జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సగ్గుర్తి వెంకటనారాయణ గారు,4వ వార్డ్ మెంబర్ షేక్ జాన్ పిర్ 8వ వార్డు మెంబర్ చావల ముత్యాలరావు  మాజీ సర్పంచ్ బాధినేని శ్రీనివాసరావు  లక్కిరెడ్డి శ్రీనివాసరెడ్డి ,

గూడూరు తిరుపతి రెడ్డి  గూడూరు నరసింహ రెడ్డి   బొక్క లావణ్య   స్కూల్ టీచర్స్ అంగన్వాడీ టీచర్స్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు , రేషన్ డీలర్ గురజాల రామారావు   సగ్గుర్తి వెంకటరాములు , సగ్గుర్తి ప్రభాకర్ బొక్క సజ్జన్ రావు  గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు,యూత్ కాంగ్రెస్ సభ్యులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కాంగ్రెస్ పార్టీ మహిళలు, తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మరిన్ని వార్తలు