కళాశాల విద్యార్థులకు దుస్తుల పంపిణీ
ములకలపల్లి,నవంబర్ 19 (విజయక్రాంతి): ములకలపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల(Government Junior College) విద్యార్థులకు గురువారం ప్రభుత్వం సరఫరా చేసిన దుస్తులను పంపిణీ చేశారు.జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకటేశ్వరరావు కళాశాలను సందర్శించి విద్యార్థులకు దుస్తులను అందజేశారు.
కళాశాలలోని ఒకేషనల్ ఎం పి హెచ్ డబ్ల్యు విద్యార్థినీలకు జరుగుతున్న ఓ.జే.టి పరీక్షల తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంటును ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలకు తక్కువ సమయం ఉన్నందున విద్యార్థులు కళాశాలకు ప్రతిరోజు గైర్హాజరు కాకుండా హాజరుకావాలని గత విద్యా సంవత్సరం కంటే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతాన్ని పెంచడానికి విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయులు సమిష్టిగా ప్రయత్నించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కల్పన,బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.