ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు
తాడ్వాయి,నవంబర్,19(విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రం లో గురువారం తొలి మహిళ ప్రధాని ఇందిరా గాంధీ (Indira Gandhi first female Prime Minister) జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా ఆమె చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నాయకులు మాట్లాడుతూ... దేశ ప్రధానిగా ఇందిరా గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివాన్నారు.
ఆమె దేశాభివృద్ధి కోసం ఎన లేని కృషి చేశారన్నారు.ఆమె దేశం కోసం ప్రాణాలర్పించిన గొప్ప నాయకురాకన్నారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ షౌకత్ అలీ,రాజీవ్ కుమార్,జిల్లా కార్యదర్శి శ్రీకాంత్,మండల యూత్ మాజీ అధ్యక్షులు అఖిల్ రావు,ఎస్సి సెల్ మండల అధ్యక్షులు గైని రాజలింగం, ఉపాధ్యక్షులు పులి ప్రభాకర్, గడ్డం రాజు, నాయకులు రాజేందర్ రావు, ఉప సర్పంచ్ గాజే రాజు,మోహన్ తదితరులు పాల్గొన్నారు.