ఇందిరా గాంధీకి మండల అధ్యక్షుడు ఘన నివాళి

19-11-2026 | 05:26pm

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్.

వెంకటాపురం, నూగూరు, నవంబర్ 19, విజయక్రాంతి:వెంకటాపురం మండల కేంద్రంలో భారత మాజీ ప్రధానమంత్రి(Former Prime Minister of India), ఉక్కు మహిళ ఇందిరా గాంధీ(Indira Gandhi) జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్య ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ అభివృద్ధికి ఇందిరా గాంధీ అందించిన సేవలను, దేశ ఐక్యత, సమగ్రత కోసం చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఆమె ధైర్యసాహసాలతో కూడిన నాయకత్వం, దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వెంకటాపురం మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు చిట్యాల సాగర్, మండల నాయకుడులు, గుండమల్ల కిరణ్ కుమార్, వేల్పుల మనోజ్, డార్ర రవి, సూర్యం, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది .

మరిన్ని వార్తలు