శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు షురూ

29-11-2026 | 08:11pm

మహబూబాబాద్, నవంబర్ 29 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) రెడ్యాల గ్రామంలో(Redyala Village) ప్రతి సంవత్సరం, లోక కల్యాణం కోసం నిర్వహించే  శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయ(Sri Sita Ramachandra Swamy Temple) బ్రహ్మోత్సవాలలో భాగంగా  నేటి నుండి  6వ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి.జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్, పీ సీ సీ రాష్ట్ర మాజీ కార్యదర్శి,రాష్ట్ర సంవిధాన్ కమిటి సభ్యులు వెన్నం శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.

మొదటి రోజు సమిష్టి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, మంగళవాయిద్యాలు, వేద స్వస్తి వాచనాల మధ్య యాగశాల ప్రవేశం, శ్రీ విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, ఋత్విక్ వరణం, రక్షాబంధనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మంగళాశాసనం, తీర్థప్రసాద గోష్టి నిర్వహించారు.

ఈ బ్రహ్మోత్సవాలు పాంచరాత్ర ఆగమోక్తముగా శ్రీమాన్ కిదాంబి నరసింహదేశికన్ స్వామివారి బృందముచే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీ నారాయణ, ఆలయ అర్చకులు కృష్ణ కిషోర్  త్రిపాఠి, నర్సింగ శ్రీనివాస్ యాదవ్,కుడుముల సురేందర్ రెడ్డి, వెంకట్రాం నర్సయ్య, వెంకన్న, విజేందర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు