మూడేళ్ల ప్రేమ.. మూడుసార్లు గర్భవిచ్ఛితి!

07-10-2026 | 05:10am
  1. పెళ్లి చేసుకుంటానని నిరాకరించిన వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ కొడుకు
  2. ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ధర్నా
  3. యువతి మీదకు పెంపుడు కుక్కను ఉసిగొల్పిన వైనం
  4. గుర్తుపట్టి ఆమె ఒడిలో కూర్చున్న శునకం

మహబూబాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): వరంగల్ జిల్లా(Warangal District) వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ సారంగపాణి కుమారుడు శ్రీకాంత్(Srikanth) మున్సిపల్ ఎన్నికలకు ముందు అదే గ్రామానికి చెందిన ఓ యువతితో ప్రేమాయణం(Love Story) సాగించాడు. పెళ్లి చేసుకుంటానని ఇంటికి కూడా తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు పరిచయం చేశాడు. కొంతకాలం వరకు వారిద్దరి మధ్య ప్రేమాయనం సజావుగానే సాగింది. మున్సిపల్ ఎన్నికలు(Municipal Elections) జరిగి సారంగపాణి మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన తర్వాత శ్రీకాంత్ ఆ యువతిని వివాహం(Marriage to a young woman) చేసుకోవడానికి నిరాకరించాడు.

దీంతో మోసపో యినట్లు గ్రహించిన యువతి తమ ప్రేమాయణం గురించి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతోపాటు పలువురి పెద్దలకు చెప్పి నా ఫలితం లేకుండా పోయింది. తనను ప్రేమ పేరుతో మూడేళ్లుగా శారీరకంగా, ఆర్థికంగా వాడుకున్నాడని, మూడుసార్లు గర్భవి చ్చితి జరిపించాడని యువతి ఆరోపిస్తూ తన కు అతనితో వివాహం జరిపించి, న్యా యం చేయాలంటూ ప్రియుడి ఇంటి ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి రెండు రోజులగా ఆందోళనకు దిగింది.

ఈ సంఘటన తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి ఆమెతో మాట్లాడినప్పటికీ తనకు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించింది. ఈ క్రమంలోనే సారంగపాణి కుటుం బ సభ్యులు తమకు రక్షణగా ఉంటున్న శునకాన్ని వీరిపైకి ఉసిగొల్పారు. శునకం కూడా ఆమెను గుర్తుపట్టి ఆమె ఒడిలో కూర్చోవడం గమనార్హం. మంగళవారం బీజేపీ నా యకులు ఆమెకు మద్దతుగా నిలిచారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన మున్సిపల్ చైర్మన్ కొడుకు చేత ఆ యువతీకి వివాహం జరిపించాలని డిమాండ్ చేశారు.

శునకానికి ఉన్న ప్రేమ మనిషికి లేకపాయే!

 యువతి, ప్రేమికుడు నయవంచనకు గురి చేయడంతో ప్రేమికుడి ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. అయితే శ్రీకాంత్ కుటుంబ సభ్యులు తమ పెంపుడు కుక్కను యువతి మీదకు ఉసిగొల్పారు. ప్రేమికుడితో ప్రేమలో ఉన్నప్పుడు ఆ యువతి ఆ కుక్కను కూడా అల్లారుముద్దుగా చూసుకోవడంతో.. ఆ కుక్క సదరు యువతి దగ్గరికి వచ్చి గుర్తుపట్టి ఒడిలోకి చేరి ప్రేమ కురిపించింది. ఈ సంఘటన చూసిన వారం తా శునకానికి ఉన్న ప్రేమ.. మనిషికి లేకపాయే అంటూ చర్చించుకున్నారు. 

మరిన్ని వార్తలు