అయ్యప్ప స్వామి భక్తులకు అన్నదానం

11-11-2026 | 08:20pm

గండీడ్, నవంబర్ 11 విజయక్రాంతి: గండీడ్ మండలంలో పాదయాత్ర చేస్తున్న అయ్యప్ప స్వామి భక్తులకు(Devotees of Lord Ayyappa) బీజేపీ నాయకులు సేవా కార్యక్రమం నిర్వహించారు. వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు యు.రమేష్ కుమార్ స్వయంగా భక్తులకు భోజనాలు వడ్డించి,అనంతరం పండ్లను పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి భక్తులకు సేవ చేసే అవకాశం లభించడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి అండగా నిలవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శంకర్ నాయక్,రాష్ట్ర నాయకుడు గిరమౌని శ్రీనివాస్,కృష్ణ ముదిరాజ్, తాండూరు పట్టణ అధ్యక్షుడు ఎన్.మల్లేశం, పెద్దేముల్ మండల అధ్యక్షుడు వీరేశంతో పాటు పలువురు బీజేపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు