పీఏసీఎస్ చైర్మన్గా అవకాశం కల్పించండి
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి బరిగెల బాలయ్య బహిరంగ లేఖ
మిడ్జిల్, నవంబర్ 29: మిడ్జిల్ పీఏసీఎస్ చైర్మన్ పదవి(Midjil PACS Chairman Post)కి తనకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బరిగెల బాలయ్య మాదిగ కోరారు. ఈ మేరకు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. 1983 నుంచి తమ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోందని, సుమారు 30 ఏళ్ల క్రితం మిడ్జిల్ మండల ఉపసర్పంచ్గా పనిచేసిన అనుభవం ఉందని బాలయ్య పేర్కొన్నారు. పార్టీ పట్ల తనకున్న నిబద్ధతను గుర్తించి పీఏసీఎస్ చైర్మన్గా అవకాశం కల్పిస్తే పార్టీ బలోపేతానికి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
అలాగే, నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్న మాజీ జెడ్పీటీసీ మహమ్మద్ గౌస్ రబ్బానికి క్యాబినెట్ హోదా కలిగిన రాష్ట్రస్థాయి చైర్మన్ పదవి కల్పించాలని కోరారు. గతంలో మిడ్జిల్ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు నామినేటెడ్ పదవి ఇస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ముఖ్యమంత్రికి సిఫార్సు చేయాలని బాలయ్య తన లేఖలో విజ్ఞప్తి చేశారు.