అమ్మానాన్నలు నాకు మంచి స్నేహితులు

29-11-2026 | 08:07pm

- వారి స్ఫూర్తితోనే క్రమశిక్షణ అలవడింది.

-  డీఐఈఓ వెంకటరమణ

నాగర్‌ కర్నూల్ నవంబర్ 29 (విజయక్రాంతి): క్రమశిక్షణ, నిజాయితీ, నిబద్ధతతో ఉద్యోగ బాధ్యతలు(Job Responsibilities) నిర్వహించడం సంతృప్తినిచ్చిందని డీఐఈఓ గూడ వెంకటరమణ అన్నారు. తాడూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా(Taduru Government Junior College Principal), ఇలా ఇంటర్మీడియట్ నోడల్ అధికారిగా(Intermediate Nodal Officer) పనిచేసి పదవీ విరమణ పొందిన వారికీ ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో ఘనంగా ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి(MLA Dr. Kuchukulla Rajesh Reddy) హాజరై దంపతులను సన్మానించారు. విద్యారంగానికి ఆయన చేసిన సేవలను వక్తలు కొనియాడారు. వారితో పాటు మున్సిపల్ చైర్మన్ సునేందర్, వైస్ చైర్మన్ బాదం రమేష్, అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు