తహసిల్దార్ కార్యాలయాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

11-11-2026 | 08:26pm

ఆర్ ఐ ప్రశాంత్ రెడ్డి పై ఎమ్మెల్యే ఆగ్రహం

దేవరకద్ర, అక్టోబర్ 11 : కౌకుంట్ల తహసిల్దార్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి(MLA Madhusudan Reddy) ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్ఐ ప్రశాంత్ రెడ్డి పనితీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్కమ్, క్యాస్ట్, ఇతరత్రా సర్టిఫికెట్ల జారీలో నిర్లక్ష్యం చేస్తున్నారని సర్టిఫికెట్ల కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్న సకాలంలో అందించడం లేదని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.

దీనిని స్పందించిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని విధుల్లో నిర్లక్ష్యం వీడి, ప్రజలకు సకాలంలో సేవలు అందించాలని అధికారులకు స్పష్టం చేశారు. కార్యక్రమంలో తహసిల్దార్ సుందర్ రాజ్, పిఎసిఎస్ చైర్మన్ అరవింద్ రెడ్డి, కౌకుంట్ల సర్పంచ్ నరేష్ కుమార్, మండల అధ్యక్షులు రాఘవేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు