నీటి పొదుపుపై విద్యార్థుల జల ప్రతిజ్ఞ

19-11-2026 | 07:03pm

రాజాపూర్ నవంబర్ 19: నీటి ఎద్దడిని(water scarcity) నివారించేందుకు మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా ఉన్నత పాఠశాలలో(PM Sri District High School) నీటి సంరక్షణపై అవగాహన కలిగి ఉండాలని గురువారం ఉదయం ప్రార్థన సమయంలో విద్యార్థులతో జల ప్రతిజ్ఞ చేసినట్లు ప్రధానోపాధ్యాయుడు సయ్యద్ ఇబ్రహీం తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని సూచించారు. అలాగే వర్షపు నీటి సంరక్షణకు ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతల ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రకృతి ప్రసాదించిన వనరులను అందరూ పొదుపుగా వాడుకుంటేనే దేశం బాగుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు