ఒప్పందానికి మించి నగదు డిమాండ్ - బెదిరింపులు

15-11-2026 | 08:15pm

వొకాస్‌ ఫుడ్‌ కోర్టు నిర్వాహకురాలు హరిత

ఘట్ కేసర్, నవంబర్ 15 (విజయక్రాంతి) : వ్యాపార నిర్వహణ(Business Management) కోసం తీసుకున్న స్థలానికి సంబంధించిన యజమానులు ఒప్పందాలను(Owners Agreements) అతిక్రమించిన భారీ అదనపు నగదు(Extra cash) డిమాండ్ తో పాటు బెదిరింపులు, పోలీసు ఫిర్యాదులతో(Threats, police complaints) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వొకాస్‌ ఫుడ్‌ కోర్టు(Vocas Food Court) నిర్వాహకురాలు హరిత గోగినేని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఇప్పటికే న్యాయస్థానాన్ని, పోలీసు కమిషనర్‌ను ఆశ్రయించినట్లు వెల్లడించారు.

ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పోచారం డివిజన్‌ జోడిమెట్ల సమీపంలోని జాతీయ రహదారి పక్కన వోకాస్  ఫుడ్‌ కోర్టు ఏర్పాటుకు  గత ఆరు నెలల క్రితం వినయ్‌ కుమార్‌ నిర్వహించిన రెస్టారెంట్‌ ప్రాంగణాన్ని ఎంపిక చేసుకున్నట్లు ఆమె వివరించారు. ఆకిటి మంజుల, ఆమె కుమారుడు ఆకిటి దివాకర్‌ రెడ్డికి చెందిన ప్లాట్‌ నంబర్‌ 1ను లీజుకు తీసుకున్నప్పటికీ, అధికారిక లీజ్‌ డీడ్‌ చేయకుండా జాప్యం చేశారని తెలిపారు.

తన ఒత్తిడితో తాత్కాలిక ఒప్పంద పత్రాలు అందించడంతో వాటి ఆధారంగా జీఎస్టీ, ఆహార భద్రత లైసెన్స్‌ పొందానని తెలిపారు. ఏప్రిల్‌ నుంచి అద్దె చెల్లిస్తున్నానని పేర్కొన్నారు. అయినప్పటికీ మరింత నగదు చెల్లించాలని, లేదంటే నీవు వ్యాపారం ఎలా చేస్తావనేది చూస్తామంటూ బెదిరింపులు చేస్తున్నారని ఆరోపించారు.

మరోవైపు ప్లాట్‌ నంబర్‌ 2కు సంబంధించి ప్రతినిధిగా శ్రీనివాస్‌ రెడ్డితో నిబంధనల మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఈక్రమంలో గతంలో రెస్టారెంట్‌ నిర్వహించిన వినయ్‌ కుమార్‌తో పాటు మంజుల, దివాకర్‌ రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి తనపై నకిలీ పత్రాలు సృష్టించి జీఎస్టీ, ఫుడ్‌ లైసెన్స్‌ పొందినట్లు పోచారం ఐటీ కారిడార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు. ఆ ఫిర్యాదుపై వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు, తాను సమర్పించిన ఆధారాలను మాత్రం పరిగణనలోకి తీసుకోలేదని, తన ఫిర్యాదుపై చర్యలు చేపట్టకపోవడం వివక్షాపూరితంగా ఉందని ఆరోపించారు.

డబ్బులు చెల్లించకపోతే ప్రాంగణం ఖాళీ చేయాలని హెచ్చరిస్తున్నారని, అయిన సరే నేను పెట్టిన పెట్టుబడి ఇవ్వాలని కోరినప్పటికి మేము స్థానికులం నీవు ఏమి చేయలేవని బెదిరింపులకు పాల్పడ్డారని, ఈ పరిణామాలు తనను తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేస్తున్నాయని హరిత ఆందోళన వ్యక్తం చేశారు. వీరితో తనకు ప్రాణ భయం ఉందని ఈ అంశంపై పోలీసు కమిషనర్‌ను కలిసి తగిన ఆధారాలు సమర్పించడంతో పాటు న్యాయస్థానంలోనూ కేసు దాఖలు చేసినట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు