విద్యుత్ వైర్ తగిలి ఒకరి మృతి
11-11-2026 | 10:28pm
దండేపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని మామిడిపల్లి శివారు అటవీ ప్రాంతం(Dandepalli forest area)లో గుర్తు తెలియని వ్యక్తులు వన్యప్రాణుల షికారు కోసం వేసిన విద్యుత్ వైర్ తగిలి బోయిడి రెడ్డి (40) మృతిచెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం రాత్రి పత్తి పంటకు రక్షణగా వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు పెట్టిన 11 కేవీ విద్యుత్ వైర్ తాకి బోయిడి రెడ్డి(40) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతిపై అనుమానం ఉందని బోయిడి రెడ్డి భార్య సరిత బుధవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు దండేపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.