రామాలయంలో వైభవంగా కార్తీక ఆకాశ దీపోత్సవం

11-11-2026 | 10:34pm

నాగర్‌ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్‌ కర్నూల్(Nagarkurnool) పట్టణంలోని రాంనగర్ కాలనీ సీతారామచంద్రస్వామి ఆలయంలో కార్తీక ఆకాశ దీపోత్సవం బుధవారం వైభవంగా ప్రారంభమైంది. వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆలయ ప్రధాన అర్చకులు కందాడ వరదరాజన్ అయ్యంగార్ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ప్రతి రోజూ సాయంత్రం 6:10 గంటలకు ప్రదోషకాలంలో సామూహిక దీపారాధన నిర్వహిస్తున్నారు. భక్తుల కోసం నువ్వుల నూనె, ప్రమిదలు, ఒత్తులను ఉచితంగా అందిస్తున్నారు. వందలాది మంది భక్తులు, మహిళలు దీపారాధనలో పాల్గొంటూ భక్తిశ్రద్ధలతో కార్తీక మాస పూజలు నిర్వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు