డాక్టరేట్ సాధించిన మహేష్ కు మంద కృష్ణ సన్మానం
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లి పట్టణానికి చెందిన రామగిరి మహేష్ ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ ఫిషరీస్(Andhra Pradesh Fisheries University) విభాగంలో డాక్టరేట్ (పీహెచ్డి) సాధించారు. ఈ నేపథ్యంలోపద్మశ్రీ అవార్డు గ్రహీత, MRPS వ్యవ స్థాపకుడు మంద కృష్ణ మాదిగ నివాసంలో కాంగ్రెస్ నాయకులు TPCC రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి ఆధ్వర్యంలో డాక్టర్ రామగిరి మహేష్ కుమార్ ను సన్మానించారు.
డాక్టరేట్ (Ph.D.) పట్టా సాధించిన డాక్టర్ రామగిరి మహేష్ కుమార్ MRPS వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ శాలువా కప్పి సన్మానించి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ..దళిత సమాజం కేవలం సామాజిక న్యాయం కోసమే కాకుండా, విద్య, ఉద్యోగ, పరిశోధన,విజ్ఞాన శాస్త్ర, పరిపాలనా రంగాల్లోనూ ఉన్నత స్థానాలను అధిరోహించాలన్నారు. ఉన్నత విద్యను అభ్యసించి డాక్టరేట్ వంటి ప్రతిష్ఠాత్మక పట్టాను సాధించి ఆదర్శంగా నిలిచారని మహేష్ ను ప్రశంసించారు.