విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి

22-11-2026 | 05:30am
  1. అల్వాల్ డివిజన్ ఏసీపీ రమేష్ 
  2. నషా ముక్త్ అల్వాల్‌పై అవగాహన ర్యాలీ

అల్వాల్, నవంబర్ 21 , విజయ క్రాంతి: విద్యార్థులు మాదక ద్రవ్యాల(Drugs) (డ్రగ్స్) కు దూ రంగా ఉండాలని అల్వాల్ డివిజన్ ఏసిపి ర మేష్(Alwal Division ACP Ramesh) సూచించారు. శనివారం అల్వాల్ వీర శివాజీ యూత్ అసోసి యేషన్  వారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.  అల్వాల్ ప్రభుత్వ బాలుర  ఉన్నత పాఠశాల నుండి, వెంకటేశ్వర కళ్యాణ మండపం వరకు ఈ ర్యాలీ కొనసాగింది.

ఈ సందర్భంగా అల్వా ల్ డివిజన్ ఏసిపి రమేష్ మాట్లాడు తూ...మాదక ద్రవ్యాల (డ్రగ్స్)ను వాడటం వలన నేరాల వైపు  అడుగు లు వేసి, దొంగతనాలు హింస వంటి నేరాలకు పాల్పడే అ వకాశాలు మెండుగా ఉంటాయ న్నారు. డ్ర గ్స్ వలన శారీరక మానసిక ప్రభావాలు మె దడుపై పడి జ్ఞాపక శక్తిని ఆలోచన శక్తిని తగ్గిస్తుందని తెలిపారు.

ఆరోగ్య సమస్యలు త లెత్తు తాయని, తీవ్రమైన ఒత్తిడి డిప్రెషన్ కు లోనై మతిస్థిమితం కోల్పవడం,  కొన్ని సందర్భాల్లో కోమ లేదా మరణానికి దారి తీస్తుందని ఆయన  తెలియజేశారు. మత్తు పదార్థా ల కు దూరంగా ఉండి ఆరోగ్యంగా బలంగా ఉండాలని ఆయన సూచించారు. చెడు వ్యసనాలకు బానిసైన విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టలేక వారి భవిష్యత్తు పూర్తి అంధకారంలోకి వెళుతుందని ఆయన తెలిపారు. 

మరిన్ని వార్తలు