ముగిసిన వనవాసి కళ్యాణ పరిషత్ ప్రాంతస్థాయి ఆర్చరీ, అథ్లెటిక్స్ పోటీలు

29-11-2026 | 07:51pm

ఘట్ కేసర్, నవంబర్ 29 (విజయక్రాంతి): వనవాసి కళ్యాణ పరిషత్ ప్రాంతం ఆధ్వర్యంలో పోచారం డివిజన్, అన్నోజిగూడలోని రాష్ట్రీయ విద్య విహార్ పాఠశాలలో మూడు రోజులుగా నిర్వహించిన వనవాసి కళ్యాణ పరిషత్ ప్రాంత స్థాయి ఆర్చరీ, అథ్లెటిక్స్ పోటీలు(Athletics Competitions) ఆదివారం ముగిశాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ జర్నలిస్టు గంట సత్యనారాయణ, గౌరవ అతిథిగా ఉప్పల్ బాగ్ కార్యవాహ్ చిన్నమ  రాజు హాజరయ్యారు. తెలంగాణ వనవాసి కళ్యాణ పరిషత్ క్రీడల ఇంచార్జ్ గుంటి సత్యనారాయణ, వనవాసి కళ్యాణ పరిషత్ సంఘటన మంత్రి వేముక ఆంజనేయులు, విభాగ్ సహసేవ ప్రముఖ్  వెంకటేష్ హాజరయ్యారు.

అలాగే తెలంగాణలోని 8 జిల్లాల నుంచి విచ్చేసిన ఆదివాసీ క్రీడాకారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథి సీనియర్ జర్నలిస్టు గంట సత్యనారాయణ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమేనని,  ఓటమిని గుణపాఠంగా నేర్చుకొని వచ్చే క్రీడల్లో విజయం సాధించాలని అన్నారు. ఎందరో ఆదివాసి క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. ఒరిస్సాలో జరుగునున్న జాతీయ స్థాయి వనవాసి కళ్యాణ పరిషత్ క్రీడల్లో విజయం సాధించాలని,  ఆదివాసీ క్రీడాకారుల్లో విలువిద్యలో  ప్రతిభ కలిగి ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వనవాసి  కల్యాణ పరిషత్ సంఘటన మంత్రి వేముఖ ఆంజనేయులు, క్రీడలు ఇంచార్జ్ గుంటి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు