బారులు తీరిన మందుబాబులు

11-11-2026 | 09:59pm
  1. బాలాజీ నగర్ లో అడ్డదిడ్డంగా పార్కింగ్.      
  2. వైన్ షాపుల వద్ద ట్రాఫిక్ కష్టాలు.    

జవహర్ నగర్ నవంబర్ 11 (విజయ క్రాంతి): అసలే  పండుగల సీజన్..., నిత్యం  వాహనాలు, రాత్రి వేళల్లో రోడ్లపై మందుబాబుల హోరు... వెరసి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్(Malkajgiri Municipal Corporation) పరిధిలోనికి కీసర సర్కిల్ జవహర్ నగర్ బాలాజీ నగర్ లోని ప్రధాన రహదారిపై ఉన్న వైన్ షాపుల ముందు అడ్డదిడ్డమైన పార్కింగ్ తో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోందని ప్రజలు వాపోతున్నారు.

మూలిగే నక్క మీద తాటి పండు పడ్డ చందంగా సాయంకాలం సమయాలలో వైన్ షాపుల ముందు వాహనాలను అడ్డదిడ్డంగా నిలుపుతుండడంతో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులకే గాక ప్రజలకు అసౌకర్యం ఏర్పడుతుందని తద్వారా మందు బాబుల ఆగడాలతో నిత్యం నరకం అనుభవిస్తున్నామని ప్రజలు పేర్కొంటున్నారు. ఇకనైనా వాహనదారుల రద్దీని తగ్గించాలని సామాజిక కార్యకర్తలు కార్తీక్రెడ్డి ఎండి ఆసిఫ్ డిమాండ్ చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.

మరిన్ని వార్తలు