భ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయంలో ఘనంగా కార్తీక వేడుకలు

14-11-2026 | 07:29pm

ఘట్ కేసర్, నవంబర్ 14 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ సర్కిల్(Ghatkesar Circle) ఎదులాబాద్ లోని శ్రీభ్రమరాంబికా మల్లికార్జునస్వామి(Sri Bhramarambika Mallikarjuna Swamy) పురాతన ఆలయంలో కార్తీక మాస పూజలు కంట్లం వంశస్తుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు(Devotees) అధిక సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవారిని  దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు భక్తులచే స్వామివారికి అభిషేకం జరుగుతుందని అలాగే ప్రతి సోమవారం దాతలచే అన్నప్రసాద వితరణ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

శనివారం ఆలయ ఆవరణలో భానుక కవిత-అంజనేయులు దంపతుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈసంధర్బంగా అన్నదాతను ఆలయ నిర్వహకులు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో దేవాలయ ధర్మకర్త కంట్లం శివకుమార్, నిర్వహకులు కంట్లం గౌరీశంకర్, నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు