పాఠశాల స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కృష్ణారావు

11-11-2026 | 08:04pm

కూకట్ పల్లి, నవంబర్ 11 (విజయక్రాంతి): కే పి హెచ్ బి రమ్య గ్రౌండ్ వద్ద ప్రభుత్వ పాఠశాల కు కేటాయించిన స్థలాన్ని విద్యా శాఖకు బదిలీ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం పాఠశాల స్థలాన్ని కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు(MLA Krishna Rao) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ఏ ఒక్కరి విజయం కాదని ప్రజలందరి విజయమన్నారు.

దాదాపు నాలుగు సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి పునాదులు వేసి పనులు ప్రారంభించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హౌసింగ్ బోర్డ్ స్థలాల పేరుతో ఈ భూమిని విక్రయించేందుకు బోర్డులు ఏర్పాటు చేసే ప్రయత్నం చేసిందన్నారు. స్థలాన్ని విక్రయించకుండా కాపాడేందుకు ఎన్నో పోరాటాలు చేసామన్నారు. ఈ పాఠశాల స్థలాన్ని కాపాడాలని గతంలో జిల్లా కలెక్టర్ పలుమార్లు వినత్ పత్రాలు అందజేసినట్లు గుర్తు చేశారు.

స్థానిక ప్రజల పోరాటం మీడియా మిత్రుల సహకారంతో ఈ స్థలం విద్యాశాఖకు విజయవంతంగా బదిలీ అయిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ లు మందాడి శ్రీనివాసరావు, పగడాల బాబురావు, బి ఆర్ ఎస్ నాయకులు కృష్ణారెడ్డి, ప్రభాకర్ గౌడ్, రాజేష్ రాయ్, పాతూరు గోపి, శివారెడ్డి, ఉపేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, వలవల నాయుడు, తిరుపతి శ్రీనివాస్ రెడ్డి, తులసి రెడ్డి, నర్సింగరావు, రామకృష్ణ, సాంబశివరావు, లతా, పద్మ, వరలక్ష్మి సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు