మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిస్తే సహించేది లేదు: కాంగ్రెస్

29-11-2026 | 07:31pm

ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి

కాంగ్రెస్ నాయకుల డిమాండ్ 

లేకుంటే ఎమ్మెల్యే 'మర్రి'ని మల్కాజిగిరిలో తిరగనివ్వం : కాంగ్రెస్

మల్కాజిగిరి, నవంబరు 29 (విజయక్రాంతి): మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Marri Rajasekhar Reddy) తన ఇష్టం వచ్చినట్లుగా అసభ్య సైగలతో మహిళల ఆత్మ గౌరవాన్ని కించపరిస్తే సహించేది లేదని మల్కాజిగిరి కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. ఆయన మహిళలకు, ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే మల్కాజిగిరిలో అడుగు పెట్టాలన్నారు.  అది కూడా మల్కాజిగిరి నడిఒడ్డున ఎమ్మెల్యే, తన ముక్కు నేలకు రాసి మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేక పోతే ఆయనను ఇక నుంచి మల్కాజిగిరి నియోజక వర్గంలో తిరగనిచ్చేది లేదని స్పష్టం చేశారు.

ఆదివారం ఆనంద్ బాగ్ లోని మైనంపల్లి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. శనివారం కౌకూర్‌లో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల టవర్ల శంకుస్థాపన కార్యక్రమం అనంతరం బహిరంగ సభలో ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు బాగా లేదన్నారు. ఆయన మహిళలను, ప్రజానీకాన్ని కించపరిచేలా వ్యవహారించారని, ఆయన అసభ్య ప్రవర్తన పట్ల మహిళలు ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. ఈ సభలో ఎమ్మెల్యే చేసిన హావభావాలు, వెకిలి చేష్టలు మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు.

సాక్షాత్తు రాష్ట్ర మంత్రి, ఎంపీ, జిల్లా కలెక్టర్, మహిళా అధికారులు పాల్గొన్న బహిరంగ సభలో,  ఇలా అసభ్యంగా ఎమ్మెల్యే వ్యవహారించడం సిగ్గుచేటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్ధానిక ఎమ్మెల్యేగా ఎంతో బాధ్యతతో వ్యవహరించాల్సిన ఆయన, బహిరంగ వేదికపై మహిళలకు సైగ చేయడం జుగుప్సరకంగా ఉందని మండిపడ్డారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు, చేష్టలతో  ఆగ్రహంగా ఉన్న మల్కాజిగిరి నియోజకవర్గం మహిళ లకు, ప్రజానీకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఆ తర్వాతే ఎమ్మెల్యే, ప్రజల్లోకి రావాలన్నారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో ఆయనను మల్కాజిగిరి నియోజకవర్గంలో తిరగనివ్వబోమని వారు హెచ్చరించారు.

విద్యా సంస్థలు నిర్వహిస్తు న్న ఓ వ్యక్తి, ప్రజాప్రతినిధిగా  విద్యార్థులకు, సమాజానికి ఎలాంటి విలువలు నేర్పుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రవర్తన కలిగిన నాయకులను, ఎమ్మెల్యేను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధి హోదాలో ఉండి సభ్య సమాజం  తలదించు కునేలా వ్యవహరించడం ఎమ్మెల్యేకు తగదని వారన్నారు. మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకా రంతో  నియోజక వర్గంలో అభివృద్ధి పనులు కొనసా గుతున్నాయని వాటిని  చూసి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి పదే పదే అసహనానికి గురవుతున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు.

రాజకీయాలకు అతీతంగా మల్కాజిగిరి అభివృద్ధికి సహకరించాల్సిన, ఇలాంటి వెకిలి చేష్టలతో ప్రజల ఆగ్రహానికి లోనవుతున్నారని వారు విమర్శించారు. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే చర్యలను సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి ఇంచార్జ్ లక్ష్మీకాంత్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ లు వై ప్రేమ్ కుమార్, రాజు జితేంద్రనాథ్, ఏకే మురుగేష్, నాయకులు, గుండా నిరంజన్, వినోద్ యాదవ్, ప్రవీణ్, శ్రీకాంత్ ముదిరాజ్ ఎస్సార్ ప్రసాద్, కపిలేశ్వర్, సత్యనారాయణ, శ్రీరామ్, శంకర్, శ్రీను, అరుణ్, మహిళా నాయకురాలు ఇందిరా ప్రియదర్శిని, ఆశ ,చిత్ర గోకుల్, భవిత, మల్లికా, రోజా ప్రభావతీ, చైనా రాణి, భవాని తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు