తైక్వాండో కలర్ బెల్ట్ టెస్ట్ లో విద్యార్థుల ప్రతిభ

29-11-2026 | 06:48pm

ఘట్ కేసర్, నవంబర్ 29 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర తైక్వాండో యూనియన్ నిర్వహించిన తైక్వాండో కలర్ బెల్ట్ టెస్ట్(Taekwondo Color Belt Test) ఘట్ కేసర్ పట్టణంలోని కెఎల్ఆర్ నగర్ లోని రిషి స్కూల్  లో నిర్వహించారు. ఈ యొక్క బెల్ట్ ఎగ్జామినేషన్ లో పాల్గొన్న రిషి స్కూల్ కి చెందిన విద్యార్థులు, అవుషాపూర్ కి  చెందిన మెరిట్ హై స్కూల్ విద్యార్థులు సుమారు రెండు గంటల పాటు నిర్వహించిన తైక్వాండో శిక్షణ లో తమ తమ ప్రతిభలను ప్రదర్శించి ఉత్తీర్ణులు అయ్యారు.

ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గ్రాండ్ మాస్టర్ కె.పి. హనుమంతు బ్లాక్ బెల్ట్ 7వ డాన్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అంతర్ జాతీయకోచ్ విద్యార్థుల ప్రదర్శనలకు మెచ్చి తగిన బెల్టులు బహుకరించారు. 

ఈ యొక్క శిక్షణకు ప్రోత్సహిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులని, రిషి స్కూల్ యాజమాన్యం డైరెక్టర్లు ఎస్. పద్మారెడ్డి, ఎస్. రవీందర్ రెడ్డి, కె. బాబుల్ రెడ్డి, డి. శంకర్ గౌడ్, జి. అభినందన్ రెడ్డి, ప్రిన్సిపాల్ పి. స్వప్న రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ కె. శ్రీనివాస్ లకు, మెరిట్ హై స్కూల్ యాజమాన్యం జి. అభినందన్ రెడ్డి, కె.ప్రిన్సిపాల్ పుష్పలత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈరెండు యాజమాన్యాల స్కూళ్లకు శిక్షణ ఇస్తున్న గ్యార నరేష్ బ్లాక్ బెల్ట్ 1వ డాన్, గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ హోల్డర్, తెలంగాణ తైక్వాండో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోచ్ ని అభినందించారు. ఈ కార్యక్రమంలో కోచ్ లు ఉదయ్ కుమార్, చరణ్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు