విద్యుత్‌కు డేంజర్ బెల్స్!

18-10-2026 | 05:25am
  1. ఐదేళ్ల ప్రణాళికే ఏకైక మార్గం 
  2. 20 వేల మెగావాట్లు దాటిన డిమాండ్
  3. అందుబాటులో 24,643 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం
  4. భవిష్యత్తు అవసరాలకు తక్షణ ప్రణాళికలు తప్పనిసరి   
  5. సౌర, పవన విద్యుత్ కొనుగోలే శరణ్యం
  6. పునరుత్పాదక ఇంధన వనరులపై ప్రత్యేక దృష్టి అవసరం

అక్టోబర్ 16 (విజయక్రాం తి): రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి(Electricity situation) ఆందోళన కలిగిస్తోంది. ఎల్ నినో ప్రభావంతో(The impact of El Niño) చలికాలంలోనూ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని మించి నాలుగైదు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. వర్షాభావ పరిస్థితులతో ప్రాజెక్టుల్లో నీరు లేక జల విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. దీనికి తోడు బొగ్గు కొరత కారణంగా థర్మల్ విద్యుత్ కేం ద్రాలు ఆశించిన స్థాయిలో పనిచేయకపోవ డం సరఫరాపై ఒత్తిడి పెరుగుతోంది.

ముఖ్యంగా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని నాలుగు యూనిట్లు కలిపి 3,200 మె గావాట్ల సామర్థ్యం కలగి ఉన్నప్పటికీ, సగటున 32 శాతం పీఎల్‌ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఓవర్)తోనే ఉత్పత్తి జరుగుతోంది. నాలుగో యూనిట్ గడిచిన 15 రోజులుగా నిలిచిపోవడం సమస్యను మరింత క్లిష్టం చేస్తోంది. ఉత్పత్తి తగ్గుదలకు తోడు డిమాం డ్ పెరుగుతుం డటంతో రాష్ట్రంలో భవిష్యత్తుపై డేం జర్ బెల్స్ మోగుతున్నాయి.

ఇప్పటికే  దీని ప్రభావం వ్యవసాయ రంగంపై పడుతుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. రానున్న రోజుల్లో పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు సైతం కోతలు తప్పేలా లేవు. నానాటికీ పెరుగుతున్న డిమాండ్, అందుబాటులో ఉన్న విద్యుత్‌కు చేరువ అవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలకు సవాల్‌గా మారుతోంది. రాబా యే రోజుల్లో విద్యుత్ కొరత మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల సమీక్ష సందర్భంగా హెచ్చరించడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో తక్షణ అవసరాలను తీర్చడంతో పాటు భవిష్యత్తును పెట్టుకొని కార్యాచరణ రూపకల్పనపై విద్యుత్ రంగ నిపుణలు దృష్టి సారించారు.  

పెరుగుతున్న డిమండ్.. పరిమితంగా స్థాపిత సామర్థ్యం   

రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో స్థాపిత సామర్థాన్ని మరింత పెంచుకోవాల్సిన అవసరం కనపడుతోంది. ప్రస్తుతం సొంతంగా థర్మల్, జల, మినీ హైడల్, సౌర విద్యుత్ స్థాపిత సామర్థ్యం 9624.96 మెగావాట్లు అందుబాటులో ఉంది. దీనికి ఇంటర్‌స్టేట్ ప్రాజెక్టుల నుంచి 76.31 మెగావాట్ల జల విద్యుత్, ప్రైవేటు సెక్టార్ నుంచి 8663.35 మెగావాట్లు (ప్రైవేటు సౌర విద్యుత్), సింగరేణి నుంచి 1200 మెగావాట్లు, చత్తీస్‌గఢ్ నుంచి 1000 మెగావాట్లు, ఇతర ప్రైవేటు సంస్థల నుంచి 269.45 మెగావాట్లు, కేంద్రం ప్రభుత్వ నుంచి మన రాష్ట్రానికి కేటాయించిన విద్యుత్ 3809.1 మెగావాట్లు కలుపుకుంటే.. 24643.17 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం అందుబాటులో ఉంది. 

అవసరాలకు సరిపోయేలా..

వాస్తవానికి 24,643 మెగావాట్ల స్థాయిలో స్థాపిత సామర్థ్యం ఉన్నా మన రాష్ట్ర డిమాండ్ మేరకు విద్యుత్ ఉత్పత్తి చేయలేదు. ఎందుకంటే.. ప్రతి విద్యుత్ కేంద్రం 100 శాతం ఉత్పత్తి చేయలేదు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని 4 యూనిట్లు కలిపి సగటున  32 శాతం పీఎల్‌ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్)తోనే పనిచేస్తున్నాయి. అలాగే జెన్‌కో ఆధ్వర్యంలో 2,430 మెగావాట్ల సామర్థ్యం ఉన్న జల విద్యుత్ కేంద్రాలు ఉన్నా.. ప్రస్తుతం రిజర్వాయర్లన్నీ నిండుకోవడంతో అంతంతమాత్రంగానే ఉత్పత్తి జరుగుతోంది. మరోవైపు బొగ్గు కొరతతో ఆశించిన స్థాయిలో ఉత్పత్తి చేయలేకపోతున్నాం. ఈ నేపథ్యంలో కొతర తప్పడం లేదు.

తక్షణ మార్గాలు ఇవీ..

ఫిబ్రవరి నాటికి ఎల్ నినో ప్రభావం మరింత తీవ్రమవుతుందని ప్రభుత్వమే చెబుతున్న నేపథ్యంలో తక్షణ విద్యుత్ సమీకరణకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సి ఉంది. సౌర విద్యుత్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచాల్సి ఉంది. ప్రస్తుతం 8,219 మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్రైవేటు కంపెనీల చేతుల్లో ఉంది. ప్రభుత్వం (జెన్‌కో) ఆధ్వర్యంలో కేవలం 3 మెగావాట్లు మాత్రమే ఉంది.

ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం సంకల్పించిన సుమారు 7,500 మెగావాట్ల సౌర విద్యుత్తును ప్రభుత్వమే చేపట్టాలి. ఎందుకంటే సౌర విద్యుత్‌నే చాలా తక్కువ వ్యవధిలో (సుమారు 3 నుంచి 6 నెలల్లో) నిర్మించవచ్చు. ప్రభుత్వం యుద్ధపాతిపదికన ప్రాజెక్టులను చేపడితే, నిధులు కేటాయిస్తే.. ఆరు నెలలకంటే తక్కువ వ్యవధిలోనే పూర్తి చేయవచ్చు. సౌర విద్యుత్ నిల్వ చేసుకోవడానికి భారీగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం (బీఈఎస్‌ఎస్)ను ఏర్పాటు చేయాలి.

అలాగే రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్  కేంద్రాలకు కావాల్సినంత బొగ్గును సమకూర్చాలి. సింగరేణి కాకుండా.. మహానది కోల్ ఫీల్డ్స్, కోల్ ఇండియాతో చర్చించి కావాల్సిన బొగ్గును సేకరించాలి. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కనీసం20 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా చూడాలి. థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నింటినీ.. కనీసం 70 శాతం పీఎల్‌ఎఫ్ తో విద్యుత్ ఉత్పత్తి జరిగేలా చూడాలి. పవన విద్యుత్‌కు కూడా సుమారు 500 మెగావాట్ల వరకు అవకాశం ఉందని తెలుస్తోంది. వీటన్నింటినీ ఉపయోగించుకోవడంతోపాటు, అవసరమైతే బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేయక తప్పదు. అప్పుడే తక్షణ మన అవసరాలు తీరుతాయి.

భవిష్యత్తు అవసరాలకూ సిద్ధం

దీనితోపాటు మన భవిష్యత్తు అవసరాలకు ప్రణాళిక వేయాలి. రాబోయే ఐదేళ్ల మన విద్యుత్ అవసరాలకు సరిపోయేలా ప్రాజెక్టులను చేపట్టాలి. పంప్డ్ స్టోరేజ్ (పీఎస్‌పీ) పవర్ ప్రాజెక్టులను చేపట్టాలి. సుమారు 20 వేల మెగావాట్లకుపైగా పీఎస్‌పీలకు అవకాశం ఉందని సీఈఏలోనూ గణాంకాలు చెబుతున్నాయి. ఈనేపథ్యంలో వీటిని వేగవంతం చేయాలి. కనీసం రెండు, మూడు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టుల్లో గణనీయంగా పూర్తి చేయగలిగితే.. అప్పటి అవసరాలకు అవి ఉపయోగపడతాయి.

అలాగే మరింత సౌర విద్యుత్తు, పవన విద్యుత్తుతోపాటు.. న్యూక్లియర్ విద్యుత్తుపైకూడా దృష్టి సారించాలి. దీనితోపాటు శ్రీశైలం, నాగార్జున సాగర్‌లలో ఉన్న రివర్స్‌పంపింగ్ వ్యవస్థలను పూర్తిగా ఉపయోగించుకునేలా ఏర్పాట్లు చేయాలి. ఈ రెండు రిజర్వాయర్ల నుంచి నీటిని గరిష్టంగా ఇరు రాష్ట్రాలు సాగు, తాగునీటి అవసరాలకు తీసుకోకుండా ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాలి.

దీనివల్ల శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ఉన్న రివర్స్‌పంపింగ్ వ్యవస్థతో సుమారు 2000 మెగావాట్ల జల విద్యుత్‌ను మన అవసరాలకోసం ఉత్పత్తి చేయవచ్చు. ఇప్పటికే ప్రణాళిక వేసిన, చేపట్టిన థర్మల్ విద్యుత్తు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా చూడాలి. సింగరేణి ఆధ్వర్యంలో మూడో యూనిట్‌ను (800 మెగావాట్లు) చేపట్టాలి. అలాగే యాదాద్రిలోని ఐదో యూనిట్ (800 మెగావాట్లు) తొందరగా పూర్తి చేయాలి.

దీనితోపాటు కొత్తగా పిట్‌హెడ్ థర్మల్ కేంద్రాలను పరిశీలించాలి. అవసరం అయితే విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాలి. అయితే దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు చిల్లు పడకుండా జాగ్రత్త పడాలి. ఇలా రాబోయే ఐదేండ్లలో వచ్చే డిమాండ్‌కు అనుగుణంగా సొంతంగానే విద్యుత్తును ఉత్పత్తి చేసేలా పకడ్బందీ ప్రణాళికన వేసి.. దానిని అదేస్థాయిలో అమలు చేయాలి. ప్రాజెక్టులను పూర్తి చేయాలి. అలా అయితేనే విద్యుత్ కొరతను ఎదుర్కోగలం.

తక్షణం చేపట్టాల్సిన చర్యలు, ఐదేళ్ల ప్రణాళికలను ఏక కాలంలో అమలు చేస్తేనే ప్రస్తుతం విద్యుత్ కొరతను తీర్చడంతో పాటు.. భవిష్యత్తు అవసరాలను కూడా అధిగమించవచ్చన్న అభిప్రాయం ఆయా వర్గాల్లో వ్యక్తమవుతోంది.   

అంచనాలకు మించి డిమాండ్ 

గురువారం రాత్రి రాష్ట్రంలో గరిష్ట డిమాండ్ 20 వేల మెగావాట్లు దాటింది. శుక్రవా రం మధ్యాహ్నం ఒక్క దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్‌పీడీసీఎల్)లోనే 12,532 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదయ్యింది. ఇక వ్యవసాయానికి పూర్తిస్థాయిలో విద్యుత్‌ను అందడం లేదన్నది సుస్పష్టం. చాలా చోట్ల రైతులు ధర్నాలు, నిరసనలకు దిగుతు ండటమే అందుకు సాక్ష్యం.

రాష్ట్రంలో ఉత్పత్తి జరిగే విద్యుత్‌లో గరిష్టంగా థర్మల్ యూనిట్‌కు రూ.6.60 పైసలు, కనిష్టంగా జల విద్యు త్ అయితే యూనిట్‌కు రూ. 2.50 నుంచి రూ. 3 కే ఉత్పత్తి చేయవచ్చు. కానీ కొరత ఉండటంతో బహిరంగ మార్కెట్‌లో యూనిట్‌ను రూ.12 నుంచి రూ.15 వరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది.

మరిన్ని వార్తలు