ఐక్యమత్యంతోనే.. కాలనీల అభివృద్ధి

29-11-2026 | 07:31pm

కేఎన్ఆర్ కాలనీగా అధ్యక్షుడిగా కరుణాకర్ ఎన్నిక.

జవహర్ నగర్, నవంబర్ 29 (విజయక్రాంతి): ఐకమత్యంతోనే కాలనీలు అభివృద్ధి చెందుతాయని కలిసి ఉంటేనే కలదు సుఖం అనే నానుడి ప్రతి కాలనీకి వర్తిస్తుందని కారింగుల నర్సింగరావు నగర్ కాలనీ(Karingula Narsinga Rao Nagar Colony) నూతన అధ్యక్షుడు ఉచ్చంతల కరుణాకర్ పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్(Malkajgiri Municipal Corporation) పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్(Jawahar Nagar) పరిధిలోని కేఎన్ఆర్ కాలనీలో కాలనీ అభివృద్ధియే  ధ్యేయంగా ఆదివారం నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ కాలనీ అధ్యక్షుడిగా ఉచ్చంతల కరుణాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నూతన కమిటీ సభ్యులుగా: గౌరవ అధ్యక్షులుగా సంధిరి శ్రీకాంత్, ఆడెపు నవీన్, అధ్యక్షుడిగా ఉచ్చంతల కర్ణాకర్ జనరల్ సెక్రటరీగా సిహెచ్. సాయిరాం, ఉపాధ్యక్షుడుగా కందులవిజయకుమార్, కోశాధికారిగా మడి పోజు సజ్జు, జాయింట్ సెక్రటరీగా పండాల అరుణ్ కుమార్, కల్చరల్ సెక్రటరీగా భాషెట్టి సౌమిత్, భాను చారి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇరిగే శ్రీకాంత్, యాక్టివ్ మెంబర్స్ గా సిహెచ్ సాయికృష్ణ ,పి. వంశీ, యు. సాయిబాబు డి. రాజు కే. సాయి, పందిరి సాయి మణికంఠ కే. పవన్ తదితరులు ఎన్నికయ్యారు.

ముఖ్య సలహాదారులుగా నంగునూరు అశోక్ గుప్త, కందుల శంకర్, రాజు గౌడ్, పందిరి శ్రీనివాసులు, కరిగళ్ళ రాజు, బి. మోహన్ ఇరిగే చంద్రమౌళి, నిజాముద్దీన్, భీష్మ చారి, రమేష్ చారి, ఉచ్చంతల రాములు, కూటి కంటి వెంకటేష్ గౌడ్, జంపాల రమేష్, గోపాల్ దుంపల రాములు, బాసెట్టి వీరేష్, బాపిరెడ్డి, రాజారాం, మహేష్, శేఖర్ గుప్తా, శ్రీనివాస్ గుప్తా, యాదగిరి చారి, ప్రసాద్, భూపతి, శ్రీనివాస్ అబ్దుల్లా  సారంగపాణి తదితరులు ఎన్నికయ్యారు. అనంతరం సలహాదారుల నుండి నియామక పత్రాన్ని అందుకున్నారు ఈ కార్యక్రమంలో కెఎన్ఆర్ కాలనీవాసులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు