హైదరాబాద్‌లో మాతృభూమి సందడి
21-11-2026 | 05:10am
సూపర్ స్టార్ సల్మాన్‌ఖాన్(Actor Salman Khan), చిత్రాంగద సింగ్ కాంబోలో రానున్న చిత్రం ‘మాతృభూమి : మే వార్ రెస్ట్ ఇన్ పీస్’. అపూర్వ లఖియా దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 4న విడుదల కానుంది. ఇటీవల ఈ మూవీ ట్రైలర్‌కు బ్లాక్‌బస్టర్ స్పందన వచ్చిన సందర్భంగా సల్మాన్‌ఖాన్, చిత్రాంగద హైదరాబాద్‌లో ప్రమోషన్స్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారిద్దరూ తమ తమ పాత్రల గురించి, కథకు ప్రాణం పోయడానికి మానసిక శ్రమ గురించి పంచుకున్నారు. షూటింగ్ సమయంలో తాము ఎదుర్కొన్న సవాళ్ల గురించి సుదీర్ఘంగా మాట్లాడారు.