నాగచైతన్యకు జోడీగా..
యువ కథానాయిక సాత్విక వీరవల్లి(Actress Satvika Veeravalli) తన అరంగేట్ర చిత్రంతోనే టాలీవుడ్లో ఆసక్తికర చర్చకు తెరలేపుతోంద. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఆమెకు అప్పుడే వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. సాత్వికకు సంబంధించి ఇప్పటివరకు అధికారికంగా వెల్లడైన కీలక ప్రాజెక్ట్ అక్కినేని నాగచైతన్య తదుపరి చిత్రం. అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో నాగచైతన్యకు జోడీగా సాత్విక నటించనుంది.
‘బెదురులంక’ ఫేమ్ క్లాక్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. తెలుగు సినిమాతోనే తన ప్రయాణాన్ని ప్రారంభించిన సాత్విక తమిళ చిత్రసీమలోనూ అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. తన తాజా ఇంటర్వ్యూలో ప్రస్తుతం ఓ తమిళ సినిమా చేస్తున్నట్లు ఆమె స్వయంగా వెల్లడించింది. అయితే ఆ సినిమా పేరు, కథానాయకుడు, దర్శకుడు తదితర వివరాలతో త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఇక మెగా హీరో రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్ కలయికలో తెరకెక్కనున్న చిత్రంలోనూ సాత్విక కథానాయికగా ఆమె పేరు వినిపిస్తుండటం ఆసక్తిని పెంచుతోంది. అయితే ఈ సినిమాలో సాత్విక నటనపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. తమిళ హీరో ధ్రువ్ విక్రమ్ నటిస్తున్న ‘జాకీ’ చిత్రంలోనూ సాత్విక నటించనున్నారనే వార్తలు వినవస్తున్నాయి. ఈ ప్రాజెక్టుతో ఆమె తమిళ ప్రేక్షకులకు మరింత చేరువయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.. అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
అల్లు అరవింద్ సాత్విక ప్రతిభపై నమ్మకంతో ఇప్పటికే మరో రెండు సినిమాలకు ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు. తాజాగా నాగచైతన్య చిత్రంలో ఆమె కథానాయికగా నటించనున్నట్లు ప్రకటించడంతో ఆ రెండు ప్రాజెక్టుల్లో ఒకటి ఏదో స్పష్టమైంది. మిగిలిన మరో సినిమా ఏది? అందులో కథానాయకుడు ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. మొత్తానికి నాగచైతన్యతో సినిమా ఖరారు కావడం, తమిళ ప్రాజెక్ట్ ఉండటం ఆమె కెరీర్‌కు మంచి ఆరంభమనే చెప్పాలి. ఇక రామ్‌చరణ్, ధ్రువ్ విక్రమ్ సినిమాలపై వస్తున్న వార్తలు నిజమవుతాయా? అల్లు అరవింద్ చెప్పిన రెండో సినిమా ఏది? అన్నది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.