నా మాతృ మాండలికంలో పాటలు రాయడం ఆనందాన్నిచ్చింది

22-11-2026 | 05:15am

చార్మింగ్ స్టార్ శర్వా నటిస్తున్న ఇంటెన్స్ పీరియడ్ యాక్షన్(Intense Period Action) డ్రామా ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వంలో(Director Sampath Nandi) తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై(Sri Sathya Sai Arts banner) కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అన్ని పాటలు గీత రచయిత చంద్రబోస్ రాశారు.

ఈ సినిమా నవంబర్ 27న థియేటర్లలోకి రానున్న సందర్భంగా లిరిక్ రైటర్ చంద్రబోస్ విలేకరులతో చిత్ర విశేషాలను పంచుకున్నారు. ‘-‘మల్లేశం’, ‘ఛాంపియన్’ సినిమాల్లో తెలంగాణ మాండలికంలో పాటలు రాశా. ‘భోగి’లో అత్యంత సహజమైన తెలంగాణ మాండలికంలో రాశా.

నేను చిన్నప్పుడు విన్నవి, మాట్లాడుకున్నవి, పరిశీలించిన మాటలను కూడా ఈ సినిమా ద్వారా రాసే అవకాశం వచ్చింది. ఇది నాకు చాలా ఆనందాన్నిచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేశా. -‘భోగి’ తెలంగాణ పల్లెటూరి బతుకు చిత్రం. ఆ జీవితాన్ని అత్యంత స్వచ్ఛమైన మాటల్లో, ఆ పరిభాష, యాసలో రాసే పనిలో సఫలమయ్యామని భావిస్తున్నాం. ప్రేక్షకుల ఆదరణ చూస్తుంటే బోలెడంత సంతోషంగా ఉంది. ప్రస్తుతం -‘రౌడీ జనార్ధన’, ‘విశ్వంభర’, రామ్ పోతినేని సినిమా, హిందీలో షారుక్ ఖాన్ సినిమా, శ్రీవిష్ణు సినిమా, ‘బరి’ సినిమాలకు రాస్తున్నా” అని చెప్పారు. 


మరిన్ని వార్తలు